అమెరికాలో ప్రఖ్యాత ఖాన్ అకాడమీకి చెందిన ఎన్నారై సల్మాన్ ఖాన్ను అధ్యక్షుడు ఒబామాకు అంతర్జాతీయ వాణిజ్య రాయబారిగా నియమించారు. పలువురిని రాయబారులుగా నియమించగా, వారిలో ఈ సల్మాన్ఖాన్ కూడా ఒకరు. వారందరితో ఒబామా తొలిసారి ఓ సమావేశం నిర్వహించారు. వీళ్లంతా అమెరికాలో పలు అంతర్జాతీయ వాణిజ్యాలలో ఆరితేరినవాళ్లు. వాళ్లంతా తమ సమయం, శక్తి, ఆలోచనలు, అనుభవాన్ని పంచుకోడానికి, తర్వాతి తరం వాణిజ్యవేత్తలను రూపొందించడానికి అంగీకరించినట్లు వైట్హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
కోల్కతాలో పుట్టిన సల్మాన్ఖాన్.. ప్రధానంగా గణితం, సైన్సుతో పాటు పలు అంశాలపై 4,800కు పైగా వీడియో పాఠాలు రూపొందించారు. ఈయన తండ్రి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంటున్నారు. ఈయన స్థాపించిన ఖాన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కు 16,33,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీటిని దాదాపు 35.5 కోట్ల సార్లు చూశారు.
ఒబామా వాణిజ్య రాయబారిగా సల్మాన్ ఖాన్
Published Tue, Apr 8 2014 10:56 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM
Advertisement