ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు:మోడీ | Indian Muslims will live and die for India, PM Narendra Modi says | Sakshi
Sakshi News home page

ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు:మోడీ

Published Fri, Sep 19 2014 2:56 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు:మోడీ - Sakshi

ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు:మోడీ

న్యూఢిల్లీ: భారతీయ ముస్లింలు దేశం కోసమే పనిచేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భారతీయ ముస్లింలను ఆల్ ఖైదా ప్రేరేపిస్తూందంటూ విడుదలైన వీడియోకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  తొలిసారి తన కార్యాలయంలో సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటూర్యూలో ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారని తెలిపారు.  'భారతీయ ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారు. అవసరమైతే దేశం కోసమే మరణిస్తారు. వారు ఎటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలని భావించరు' అని మోడీ తెలిపారు.

 

'నాకు తెలుసు. కొంతమంది దేశంలోని ముస్లింలను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వాడుకోవాలని భావిస్తున్నారు. వారు మద్దెలకు భారతీయ ముస్లింలను పావులుగా చేయాలని యోచిస్తున్నారు. అది వారి భ్రాంతి మాత్రమే.  భారతదేశంలో ముస్లింలు ఒక జాతి.  వారు సమయానుకూలంగా ఎటుబడితే  అటుమారే వారు కాదు అని'  మోడీ తెలిపారు. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో విస్తరించిన అంతర్జాతీయ ఉగ్రవాదం సంస్థ ఆల్ ఖైదా లో భారతీయ ముస్లింలు ఉండకపోవచ్చనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement