సింగపూర్లో భారతీయులు అరెస్ట్
సింగపూర్: వీసా కాలపరిమితి ముగిసిన ఇంకా దేశంలోనే నివసిస్తున్న 26 మందిని ఇమ్మిగ్రేషన్ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు సింగపూర్ ఇమ్మిగ్రేషన్ మరియు చెక్ పాయింట్ అథారటీ (ఐసీఏ) ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం సింగపూర్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో అత్యధికులు భారత్కు చెందిన వారు కాగా మిగత వారు చైనా దేశస్థులని వారు పేర్కొన్నారు.
వీరికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల యూఎస్ డాలర్లు జరిమాన విధించ వచ్చని అన్నారు. లేకుంటే జైలు శిక్ష, జరిమాన రెండు విధించే అవకాశాలు కూడా ఉన్నాయని ఐసీఏ ఉన్నతాధికారులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 26 నుంచి 62 ఏళ్ల వయస్సు గల వారున్నారని తెలిపారు.