వీసా లేకుండా సింగపూర్కి..
వీసా లేకుండా సింగపూర్కి..
Published Wed, Nov 2 2016 1:20 PM | Last Updated on Tue, Aug 7 2018 4:23 PM
ముంబై : చల్లని సాయంత్రం పూట సింగపూర్లోని క్లార్కే క్వే వద్ద సమయం గడపాలని ఉందా.. దోహాలోని ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియంను తిలకించాలని ఉందా.. అయితే భారతీయులకు బంపర్ ఆఫర్. సింగపూర్, ఖతార్లో 96 గంటల ఉచితంగా విహరించే వీసా సౌకర్యం పాస్పోర్టు హోల్డర్స్కు దక్కనుంది. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, యునిటెడ్ కింగ్డమ్, అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు జారీచేసిన వీసాలను భారతీయులు ఎవరైతే ఎక్కువకాలానికి(కనీసం నెలపాటు వాలిడిటీ) తీసుకుని ఉంటారో వారికి వీసా రహిత రవాణా సౌకర్యాన్ని సింగపూర్ కల్పించనుంది. వీసాపై ఎలాంటి చెల్లింపులు లేకుండా ఉచితంగా నాలుగు రోజుల పాటు సింగపూర్లో గడపవచ్చని ఆ దేశం పేర్కొంది. ఆయా గమ్యస్థానాలకు వెళ్తున్న సమయంలో కాని, తిరుగు ప్రయాణాల్లో కాని ఈ సౌకర్యాన్ని భారతీయులు వాడుకోవచ్చు.
నాలుగు రోజుల వీసా రహిత రవాణా సౌకర్యాన్ని సింగపూర్ గతవారమే లాంచ్ చేసింది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఈ ఉచిత సౌకర్యాన్ని ఆ దేశం నాలుగు రోజుల కంటే మించి పొడిగించవు. సింగపూర్ అమలుచేస్తున్న ఈ స్కీమ్నే ఖతార్ కూడా అవలంబించనుందని మంగళవారం ఆ దేశం కూడా ప్రకటించింది. ఉచిత ట్రాన్సిట్ వీసాను ప్యాసెంజర్లు ఖతార్ ఎయిర్వేస్ ఆఫీసు లేదా ఆన్లైన్లో పొందవచ్చని పేర్కొంది. అయితే ప్యాసెంజర్ల టిక్కెట్పై ఖతార్లోకి ప్రవేశించిన జర్నీ టిక్కెట్, ఖతార్ ఎయిర్వేస్ నుంచి బయలుదేరే సమయాన్ని తెలుపాల్సి ఉంటుంది. సింగపూర్, ఖతార్లలో టూరిజాన్ని ప్రమోట్ చేసే నేపథ్యంలో 96 గంటల వీసారహిత సౌకర్యాన్ని అందిస్తున్నామని ఆ దేశాలు పేర్కొన్నాయి. ఈ స్కీమ్ను భారతీయులందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపాయి.
Advertisement
Advertisement