
భారత్‌లో కార్పొరేట్ పన్నులు అధికం
న్యూఢిల్లీ: భారత్‌లోనే కార్పొరేట్ పన్నులు అధికమని ప్రపంచ బ్యాంక్, ప్రైస్‌వాటర్స్‌కూపర్ తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ సగటు కంటే భారత కంపెనీలు చెల్లించే మొత్తాలే అధికమని పేర్కొంది. భారత్‌లో పన్ను లు చెల్లించే కాలం కూడా తక్కువేనని పేర్కొంది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు. భారత్‌లో మొత్తం కార్పొరేట్ పన్ను లు 63 శాతంగా ఉన్నాయి. లాభం, శ్రామికులు, ఇతర పద్దుల కింద భారత కంపెనీలు దాదాపు 33 రకాలైన చెల్లింపులు జరుపుతున్నాయి. అంతర్జాతీయ సగటును చూస్తే, పన్నులు 43 శాతంగానూ, 27 రకాలైన చెల్లింపులు ఉన్నాయి. మొత్తం మీద పన్నుల చెల్లింపుల్లో భారత్ ర్యాంక్ 158గా ఉంది. మొదటి స్థానంలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియాలు ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా పన్ను చెల్లింపుల సౌలభ్యం ఉన్న ఏకైక దక్షిణాసియా దేశం భారత్ మాత్రమే.