దక్షిణ కొరియాకు అరుదైన బహుమతి | India's gift to South Korea: A sacred Bodhi Tree sapling | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాకు అరుదైన బహుమతి

Published Sat, Mar 8 2014 10:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

దక్షిణ కొరియాకు అరుదైన బహుమతి

దక్షిణ కొరియాకు అరుదైన బహుమతి

దక్షిణ కొరియాలో దాదాపు నాలుగోవంతు జనాభా.. అంటే దాదాపు 5 కోట్ల మంది బౌద్ధులే. దాంతో భారతదేశం ఆ దేశానికి అరుదైన బహుమతి అందజేసింది. బుద్ధగయ పట్టణం నుంచి ఓ పవిత్రమైన బోధిచెట్టును అక్కడకు పంపింది. చిన్న మొక్కను ప్రధాని తన ప్రత్యేక దూతల ద్వారా ఆ దేశానికి పంపారు. భారత- కొరియాల మధ్య స్నేహసంబంధాలకు గుర్తుగా తాను ఈ బోధి మొక్కను పంపుతానని గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. దక్షిణకొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హైకి చెప్పారు. ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ఈ జనవరిలో ఆమె భారతదేశంలో పర్యటించారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధులు, దక్షిణకొరియా అటవీశాఖాధికారులు కలిసి ఈ మొక్కను విమానంలో తీసుకెళ్లారు. సియోల్ విమానాశ్రయంలో దక్షిణకొరియాకు భారత రాయబారి అయిన విష్ణుప్రకాష్ ఆ మొక్కకు, బృందానికి స్వాగతం పలికారు. ఆయనతో పాటు దక్షిణకొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ బయాంగ్హూ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement