
పశుపతినాథ్ ఆలయం సురక్షితమేనా?
నేపాల్లో సంభవించిన పెను భూకంపం తర్వాత అక్కడి ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం ఎలా ఉందన్న విషయం స్పష్టంగా తెలియడంలేదు. రిక్టర్ స్కేలుపై 8.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఆలయానికి కొద్దిగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికల్లో తెలుస్తోంది. ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ నాయకుడు భగత్ ఎస్. కొష్యారీ అయితే ఆలయానికి కొద్దిగా నష్టం వాటిల్లినట్లు నేపాల్ ప్రభుత్వాధికారులు, అక్కడి ఆర్ఎస్ఎస్ విభాగం నుంచి సమాచారం వచ్చిందని ట్వీట్ చేశారు.
కానీ నళినీ సింగ్ అనే జర్నలిస్టు మాత్రం అసలు ఆలయానికి ఎలాంటి నష్టం లేదని అన్నారు. పశుపతినాథ్ ఆలయ ప్రాంగణం మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ వెళ్లినప్పుడు పశుపతినాథ్ ఆలయానికి వెళ్లి అక్కడ శివుడిని దర్శించుకున్నారు.