ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇజ్ది తెగవారు
బాగ్దాద్: గతంలో అపహరించిన ఇజ్ది తెగకు చెందిన దాదాపు 200 మందిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది. బాగ్దాద్కు 250 కిలోమీటర్లు దూరంలోని కిరిక్ పట్టణంలో వీరిందరిని శనివారం వదిలిపెట్టారని తెలిపింది. పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విడుదలైన బందీలలో అత్యధికులు వృద్ధులు ఉన్నారు.
గత ఏడాది ఆగస్టులో సింజర్ పట్టణంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇజ్ది తెగకు చెందిన వారిపై దాడి చేసి చంపారు. అనంతరం వందలాది మందిని అపహరించుకుని పోయిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 10వ తేదీ నుంచి ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నరమేథం సృష్టిస్తున్నా విషయం విదితమే.