పారిస్, బ్రస్సెల్స్ దాడుల సూత్రదారుడు హతం | IS spokesman al-Adnani killed in US air strike: Pentagon | Sakshi
Sakshi News home page

పారిస్, బ్రస్సెల్స్ దాడుల సూత్రదారుడు హతం

Published Tue, Sep 13 2016 7:16 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

పారిస్, బ్రస్సెల్స్ దాడుల సూత్రదారుడు హతం - Sakshi

పారిస్, బ్రస్సెల్స్ దాడుల సూత్రదారుడు హతం

వాషింగ్టన్: అమెరికా డ్రోన్ దాడిలో ఐసిస్ నేత, అధికార ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నాని గత నెలలో మరణించినట్లు పెంటగాన్ ప్రకటించింది. గత నెల 30న సిరియాకు చేరువలోని అల్ బబ్ ప్రాంతంలో ప్రేడేటర్ డ్రోన్ జరిపిన బాంబుదాడుల్లో ఐసిస్ రిక్రూటర్, బాంబు దాడుల సూత్రధారి అల్ అద్నానిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. అద్నాని పారిస్, బ్రస్సెల్స్, ఇస్తాంబుల్, బంగ్లాదేశ్, రష్యా విమానం, అంకారా ఆత్మాహుతి దాడుల సూత్రధారని చెప్పింది. ఐసిస్ పై వరుసగా చేస్తున్న దాడుల్లో ఇది అత్యంత కీలకమైందని తెలిపింది.

గత కొద్ది దాడుల్లో ఐసిస్ ను కీలక విభాగాల్లో ముందుకు నడిపించే లీడర్లను హతమార్చినట్లు చెప్పింది. దీంతో ఐసిస్ ఆర్ధికంగా, మిలటరీ పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపింది. అద్నాని తామే హతం చేశామని రష్యా ప్రకటించడంపై పెంటగాన్ స్పందించింది. రష్యా వ్యాఖ్యలు హాస్యాస్పదమని పెంటగాన్ అధికారులు వ్యాఖ్యానించారు.








 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement