జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త సెడాన్ ను లాంచ్ చేసింది.తన ప్రీమియం బిజినెస్ సెడాన్ సెగ్మెంట్ లో 'జాగ్వార్ ఎక్స్ ఎఫ్' బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 49.50 లక్షల (ఎక్స్-ఢిల్లీ) నుంచి ప్రారంభవుతాయని కంపెనీ, తమ అధికారిక 23 జాగ్వార్ సెంటర్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. 2016 సెప్టెంబర్ మాసాంతానికి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. కొత్త జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ప్యూర్, ప్రెస్టీజ్, పోర్ట్‌ఫోలియో అనే మూడు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
జాగ్వార్ మోడల్ కార్లు గత కొన్నేళ్లుగా అత్యంత ప్రజాదరణతో భారత మార్కెట్లో విజయం సాధించాయని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు రోహిత్ సూరి తెలిపారు. ఈ నేపథ్యంలో తమకొత్త జాగ్వార్ ఎక్స్ ఎఫ్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. విశాలమైన, విలాసవంతమైన క్యాబిన్ కోసం మునుపటి తరం ఎక్స్ ఎఫ్ తో పోలిస్తే లెగ్ రూం, నీరూంను
రూంను 24 మి. మీ,15 మిమీ పెంచినట్టు పేర్కొంది. 132 కెడబ్ల్యూ పవర్ అందించే ఇగ్నీషియం, 4- సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజీన్ , మెరిడీయిన్ సౌండ్ సిస్టం 'జె' బ్లేడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ , ఎల్ ఈడీ హెడ్ లైట్స్ తో ప్రస్ఫుటమైన కాంతితో రాత్రి ప్రయాణంలో అలసట తగ్గించడానికి సహాయపడేలా నాణ్యమైన, ప్రకాశవంతమైన లైట్లను అమర్చినట్టు ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది.
కాగా ఆడి ఏ6, ఇ-క్లాస్ మెర్సిడెజ్ బెంజ్, వోల్వో ఎస్ 80, బీఎండబ్ల్యు - 3 సిరీస్ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.
జాగ్వార్ కొత్త బిజినెస్ సెడాన్ లాంచ్
Published Wed, Sep 21 2016 4:14 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement