కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ వస్తోంది.. | Japan's Terra Motors unveils Rs. 18 lakh electric superbike | Sakshi
Sakshi News home page

కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ వస్తోంది..

Published Wed, Jan 29 2014 1:32 AM | Last Updated on Wed, Sep 5 2018 3:47 PM

కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ వస్తోంది.. - Sakshi

కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ వస్తోంది..

న్యూఢిల్లీ: భారత టూవీలర్ల మార్కెట్లోకి జపాన్‌కు చెందిన టెర్రా మోటార్స్ ప్రవేశిస్తోంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్లు తయారు చేస్తోంది. రూ. 18 లక్షల ఖరీదుండే కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌ను త్వరలో అందిస్తామని టెర్రా మోటార్స్ సీఈవో, ఫౌండర్ తొరు టొకుషిగె చెప్పారు.

 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ కివామి బైక్ భారత్‌లోనే తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్  అని, ఈ బైక్‌ను జపాన్‌లో పూర్తిగా చేతితోనే తయారు చేయించామని తెలిపారు.  భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా అందిస్తామని ఆయన వివరించారు. వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ సూపర్ బైక్‌ను, ఈ-స్కూటర్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ప్రదర్శించనున్నామని టొకుషిగె వెల్లడించారు.

 కివామి ప్రత్యేకతలు ఇవీ...
 1,000 సీసీ బైక్, గరిష్ట వేగం గంటకు 160 కిమీ. ఈ బైక్‌ను ఒక్కసారి చార్జింగ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణించగలదు. ఇంత అధిక దూరం భారత్ మార్కెట్లో ఉన్న ఏ ఇతర ఎలక్ట్రిక్ బైక్ ప్రయాణించలేదని  టొకుషిగె వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement