superbikes
-
ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో నూతన సూపర్‌బైక్స్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వీటిలో అప్రీలియా ఆర్ఎస్ 660, టూవోనో 660, అప్రీలియా ఆర్ఎస్వీ4, టూవోనో వీ4, మోటో గుజ్జి వీ85టీటీ ఉన్నాయి. ధరలు రూ.13.09 లక్షల నుంచి రూ.23.69 లక్షల వరకు ఉంది. మోటోప్లెక్స్ డీలర్షిప్స్ వద్ద ఇవి లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని కంపెనీ తెలిపింది. ధర 660 సీసీ అప్రీలియా ఆర్ఎస్ 660 రూ.13.39 లక్షలు, టూవోనో 660 రూ.13.09 లక్షలు, 1078 సీసీ ఆర్ఎస్వీ4 రూ.23.69 లక్షలు, 1077 సీసీ టూవోనో వీ4 రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగుజ్జి వీ85టీటీ రూ.15.4 లక్షలు ఉంది. -
కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ వస్తోంది..
న్యూఢిల్లీ: భారత టూవీలర్ల మార్కెట్లోకి జపాన్‌కు చెందిన టెర్రా మోటార్స్ ప్రవేశిస్తోంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్లు తయారు చేస్తోంది. రూ. 18 లక్షల ఖరీదుండే కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌ను త్వరలో అందిస్తామని టెర్రా మోటార్స్ సీఈవో, ఫౌండర్ తొరు టొకుషిగె చెప్పారు. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ కివామి బైక్ భారత్‌లోనే తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ అని, ఈ బైక్‌ను జపాన్‌లో పూర్తిగా చేతితోనే తయారు చేయించామని తెలిపారు. భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా అందిస్తామని ఆయన వివరించారు. వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ సూపర్ బైక్‌ను, ఈ-స్కూటర్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ప్రదర్శించనున్నామని టొకుషిగె వెల్లడించారు. కివామి ప్రత్యేకతలు ఇవీ... 1,000 సీసీ బైక్, గరిష్ట వేగం గంటకు 160 కిమీ. ఈ బైక్‌ను ఒక్కసారి చార్జింగ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణించగలదు. ఇంత అధిక దూరం భారత్ మార్కెట్లో ఉన్న ఏ ఇతర ఎలక్ట్రిక్ బైక్ ప్రయాణించలేదని టొకుషిగె వివరించారు. -
కవాసాకి.. రెండు కొత్త లగ్జరీ బైకులు
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసాకి తాజాగా జడ్1000, నింజా 1000 పేరిట భారత్‌లో రెండు ప్రీమియం సూపర్‌బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 12 లక్షలుగా (ఢిల్లీలో షోరూం ధర) ఉంటుంది. ఒక్కో మోడల్లో ఏటా కనీసం 100 బైక్‌లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ భారత విభాగం డిప్యూటీ ఎండీ నిస్కికావా షిగెటో తెలిపారు. అలాగే సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మరో రెండు మోడల్స్ (జడ్ఎక్స్-14ఆర్, జడ్ఎక్స్-10ఆర్) అమ్మకాలు సుమారు 50 దాకా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. జడ్1000, నింజా 1000 బైక్‌లలో 1,043 సీసీ సామర్ధ్యం గల ఇంజిన్లు ఉంటాయి. వీటిని జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని పుణె, ఢిల్లీలోని కవాసాకి షోరూమ్‌లలో విక్రయిస్తారు. కంపెనీ ఇప్పటికే నింజా 300, నింజా 600 బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి రేటు రూ. 3.5 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంది.