
స్పెయిన్ యువరాణికి మోసం కేసులో సమన్లు
మాడ్రిడ్: మోసం కేసులో ఫిబ్రవరి 8న కోర్టుకు హాజరు కావాలంటూ స్పెయిన్ యువరాణికి ఒక జడ్జి సమన్లు పంపారు. స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ చిన్న కుమార్తె క్రిస్టినా (48) పన్నుల మోసానికి, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆమె అమాయకురాలని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. క్రిస్టినా తొలుత అప్పీలు చేయాలని భావించినా, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మాజోర్కా దీవికి చెందిన జడ్జి జోస్ క్యాస్ట్రో ఆమెకు సమన్లు పంపారు. కాగా, స్పెయిన్ రాచకుటుంబానికి చెందిన వారు ఇలాంటి ఆరోపణలతో కోర్టు మెట్లెక్కే పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి.