న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు.. తన స్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేరును సిఫారసు చేశారు. వచ్చే నెల 2న జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీ విరమణ చేయనున్నారు.
పదవీ విరమణ చేసేముందు సుప్రీం కోర్టు సీజీ తన వారసుడి పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జస్టిస్ ఠాకూర్ ఏడాది ఒక నెల పాటు అనగా డిసెంబర్ 2 నుంచి 2017 జనవరి 3 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ ఠాకూర్ పంజాబ్, హర్యానా హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.
సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
Published Wed, Nov 4 2015 4:30 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement