'విమానాలన్నింటిని ధ్వంసం చేసేందుకే దాడి'
Published Mon, Jun 9 2014 7:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
కరాచీ: ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసిన అన్ని విమానాలను తాలిబాన్ మిలిటెంట్లు ధ్వంసం చేయాలనుకునే లక్ష్యంతోనే కరాచీ ఎయిర్ పోర్ట్ పై దాడులు చేశారని ఓ నివేదికను పాక్ అధికారులు సమర్పించారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిపై ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఓ ప్రాథమిక నివేదికను అధికారులు సమర్పించారు.
రెండు మార్గాల్లో విమానాశ్రాయంలోకి జొరబడిన ఉగ్రావాదుల ప్రయత్నాన్ని భద్రతా దళాలు చాకచక్యంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయ నెట్ వర్క్ ను ధ్వంసం చేయాలనే వ్యూహంతోనే ఉగ్రవాదులు కుట్ర పన్నారని నివేదికలో వెల్లడించారు.
విమానాశ్రయంపై జరిగిన దాడిని ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది సాధారణ ప్రజలతోపాటు 10 మంది ఉగ్రవాదులు ఈ ఘటనలో చనిపోయారు.
Advertisement