
మహిళా బిల్లును ఆమోదించండి: కరుణానిధి
చెన్నై: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. ఈ బిల్లు ఆమోదించిన తర్వాతే బీసీలకు సబ్ కోటాపై ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు ఉన్న మెజారిటీ దృష్ట్యా బిల్లు ఆమోదం పొందడం సాధ్యమేనని పేర్కొన్నారు. ఈ మేరకు కరుణానిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.