విద్యార్థి ప్రాణం తీసిన చెట్టు | Kerala student killed by falling coconut tree | Sakshi
Sakshi News home page

విద్యార్థి ప్రాణం తీసిన చెట్టు

Published Wed, Jul 8 2015 6:20 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

Kerala student killed by falling coconut tree

కోజికోడ్: కొబ్బరి చెట్టు కూలిపోయి మీద పడడంతో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన కేరళలోని చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలోని మీనచంతా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలులు వీయడంతో కొబ్బరిచెట్టు కూలి ఆడుకుంటున్న విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో షిజిల్ అహ్మద్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. ఎర్నాకులం జిల్లా కొత్తమంగళంలో గతనెలలో స్కూల్ బస్సుపై చెట్టుపడి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement