ఆరు కేజీల బంగారంతో కేరళీయుడి పట్టివేత | keralite held at Kathmandu airport | Sakshi
Sakshi News home page

ఆరు కేజీల బంగారంతో కేరళీయుడి పట్టివేత

Published Wed, Jan 15 2014 5:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

keralite held at Kathmandu airport

ఖట్మాండు: ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరు కిలోల బంగారం, భారీ మొత్తంలో సౌదీ అరేబియా కరెన్సీ కల్గి ఉన్న ఓ కేరళీయుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.  మహ్మద్ సనుద్ (22) అనే కేరళీయుడు మంగళవారం నాడు ఫ్లై దుబాయ్ విమానంలో నేపాల్ రాజధాని ఖాట్మాండులోని విమానాశ్రయంలో దిగాడు.

కస్టమ్స్ అధికారులు అతడిని చెక్ చేస్తుండగా ఒక్కోటీ కిలో బరువున్న ఆరు బంగారు కడ్డీలతో పాటు 15,500 దిర్హామ్ల సౌదీ అరేబియా కరెన్సీ కూడా అతడి వద్ద పట్టుబడింది. నడుం నొప్పి నివారణకు ఉపయోగించే బెల్టులో ఈ ఆరు బంగారు కడ్డీలను దాచిపెట్టి అతడు తీసుకెళ్లినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement