నేపాల్ రాజధాని కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం మధ్యాహ్నం మళ్లీ తెరిచారు.
కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం మధ్యాహ్నం మళ్లీ తెరిచారు. 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎయిర్ పోర్టును మూసివేశారు.
భూప్రకంపనల ధాటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) టవర్ ఊగడంతో అందులో ఉన్న వ్యక్తి హుటాహుటిన కిందకు దిగిపోయాడని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్య విమానాశ్రాయాన్ని మూసేశారు. ఎయిర్ పోర్టు తెరిచిన తర్వాత ఇక్కడి నుంచి రెండు విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. థాయ్ ఎయిర్ వేస్ విమానం బ్యాంకాక్ కు, ఇండిగో ఫ్లైట్ ఢిల్లీకి బయలుదేరాయని చెప్పారు.