Kathmandu airport
-
నేపాల్ విమానానికి రంద్రాలు..టిష్యూతో కవర్ చేసిన ఎయిర్‌హోస్ట్
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. This is really really sad. Few yrs ago on my flight to Pokhara, when I told the stewardess that airflow was coming from the corner of a window while airborne, she brought a tissue paper & stuffed the crevice. Decided to never fly to Pokhara again expecting the worst one day 😔 https://t.co/Mf8kBHqIWV — Kunal Bahl (@1kunalbahl) January 15, 2023 ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బహ్ల్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ విమాన ప్రమాద వార్తని ట్వీట్ చేశారు. గతంలో బిజినెస్ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్‌కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న ఎయిర్ హోస్ట్‌కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది. నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్లో తెలిపారు. -
మంత్రి ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం
ఖాట్మాండు: నేపాల్ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రకాష్ శరణ్ మహట్ సహా 150 మంది ప్రయాణిస్తున్న విమానానికి చిన్న ప్రమాదం జరిగింది. మంగళవారం ఢిల్లీ నుంచి ఖాట్మాండుకు వెళ్లిన నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో టైరు పేలిపోయింది. విమానం పాక్షికంగా దెబ్బతిని, రన్ వేపై ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి సహా ప్రయాణికులు భయపడిపోయారు. కాగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రితో సహా ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, వారిని ఎయిర్‌పోర్టు టర్మినల్ వద్దకు చేర్చామని అధికారులు తెలిపారు. కాగా విమానంతో పాటు రన్ వే పాక్షికంగా దెబ్బతినడంతో గంటసేపు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తుల తర్వాత పునరుద్ధరించారు. భారత్ పర్యటనకు వచ్చిన ప్రకాష్ శరణ్ ఈ రోజు స్వదేశానికి తిరిగి వెళ్లారు. -
ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్
ఖట్మాండ్: ఢిల్లీ-ఖట్మాండ్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఖట్మాండ్ విమానశ్రయం నుంచి ఆదివారం ఢిల్లీ రావాల్సిన ఎయిర్వేస్ జెట్ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన నేపాల్ విమానాశ్రయ అధికారులు విమానంలోని ప్రయాణికులందరినీ వెంటనే దింపేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను దింపేసిన అనంతరం బాంబు స్క్వాడ్ అక్కడకు చేరుకుని విమానంలో క్షుణంగా తనిఖీలు నిర్వహించింది. అయితే ఆ విమానంలో బాంబు వంటి పేలుడు పదార్థాలు ఏమి దొరకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికుల లగేజీలను కూడా సోదా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాలన్నీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వరకు రద్దు చేయబడినట్టు విమానశ్రయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మళ్లీ తెరుచుకున్న కఠ్మాండు ఎయిర్ పోర్ట్
కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం మధ్యాహ్నం మళ్లీ తెరిచారు. 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎయిర్ పోర్టును మూసివేశారు. భూప్రకంపనల ధాటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) టవర్ ఊగడంతో అందులో ఉన్న వ్యక్తి హుటాహుటిన కిందకు దిగిపోయాడని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్య విమానాశ్రాయాన్ని మూసేశారు. ఎయిర్ పోర్టు తెరిచిన తర్వాత ఇక్కడి నుంచి రెండు విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. థాయ్ ఎయిర్ వేస్ విమానం బ్యాంకాక్ కు, ఇండిగో ఫ్లైట్ ఢిల్లీకి బయలుదేరాయని చెప్పారు. -
ఆరు కేజీల బంగారంతో కేరళీయుడి పట్టివేత
ఖట్మాండు: ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరు కిలోల బంగారం, భారీ మొత్తంలో సౌదీ అరేబియా కరెన్సీ కల్గి ఉన్న ఓ కేరళీయుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ సనుద్ (22) అనే కేరళీయుడు మంగళవారం నాడు ఫ్లై దుబాయ్ విమానంలో నేపాల్ రాజధాని ఖాట్మాండులోని విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారులు అతడిని చెక్ చేస్తుండగా ఒక్కోటీ కిలో బరువున్న ఆరు బంగారు కడ్డీలతో పాటు 15,500 దిర్హామ్‌ల సౌదీ అరేబియా కరెన్సీ కూడా అతడి వద్ద పట్టుబడింది. నడుం నొప్పి నివారణకు ఉపయోగించే బెల్టులో ఈ ఆరు బంగారు కడ్డీలను దాచిపెట్టి అతడు తీసుకెళ్లినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.