అమ్మను విమర్శించినందుకు రాజద్రోహం కేసు
చెన్నై: తమిళనాడు సీఎం జయలలితపై అభ్యంతరకర పాటలు రాసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు రాజద్రోహం కేసులో కామ్రేడ్ కోవన్‌కు ఎగ్మోర్ మెజిస్ట్రేటు నవంబర్ 6 వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారు. తమిళనాట మద్యనిషేధ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మక్కల్ కలై ఇలక్కియ కళగం సంస్థకు చెందిన కోవన్.. ఇందుకోసం రాసిన పాటలో జయతోపాటు డీఎంకే అధినేత కరుణానిధిపైనా అభ్యంతర పదాలతో పాటలు పాడి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో కోవన్‌పై పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు. అయితే.. మద్యనిషేధంపై పోరాటం చేస్తున్న కార్యకర్తను అరెస్టు చేయటం అన్యాయమంటూ కాంగ్రెస్ మండిపడింది.