ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం : కేటీఆర్ | ktr takes on opposition parties | Sakshi
Sakshi News home page

ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం : కేటీఆర్

Published Sat, Oct 10 2015 11:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం : కేటీఆర్

ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం : కేటీఆర్

హైదరాబాద్ : విపక్ష పార్టీలపై తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు.  విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ విపక్షాలు ఏనాడూ ఏకంకాలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని విమర్శించారు.

రుణమాఫీ హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమతో ప్రతిపక్షాలు కలసి రాకపోయినా... ప్రజల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement