సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంతో ఇపుడు రాష్ట్ర శాసనమండలి అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే శాసనమండలి రద్దవుతుంది. రాష్ట్ర విభజనపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రూపొందించిన నోట్ ముసాయిదాను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. పైగా, శాసనమండలి ప్రస్తావన ముసాయిదాలో ఎక్కడా లేదని, రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే శాసనమండలి రద్దవుతుందని చెబుతున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని 294 వుంది సభ్యులతో కూడిన శాసనసభలో 119 స్థానాలు తెలంగాణకు, 175స్థానాలు సీమాంధ్రకు చెందుతాయని వుుసారుుదా స్పష్టం చేసింది. మొత్తం 18 రాజ్యసభ స్థానాల్లో 8 తెలంగాణకు 10 సీమాంధ్రకు దక్కుతాయని ముసాయిదా వివరించింది. అయితే ఈ క్రమంలో శాసనమండలి భవితవ్యం ఏమిటన్న అంశాన్ని ముసాయిదాలో ఎక్కడా ప్రస్తావించలేదు.
అదే వుుసారుుదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఖరారు చేసిన ముసాయిదాపై శుక్రవారం వుంత్రుల బృందాన్ని (జీవోఎంను) నియమిస్తారని కూడా తెలిసింది. విభజన అనంతరం ఏర్పడే రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో తలెత్తే సమస్యలకు, నీటి వనరులు, ఆర్థిక వనరులు, ఉద్యోగుల సమస్యలపై తీసుకోవలసిన చర్యలను వుంత్రుల బృందం సూచిస్తుంది. విభజనపై ముసాయిదా బిల్లును కూడా రూపొందిస్తుంది. ఆ ముసాయిదా బిల్లుపై చర్చించి, కేంద్రం ఆమోదం లభించిన తర్వాతే దాన్ని రాష్ట్రపతికి నివేదిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. అక్కడినుంచి, రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ అభిప్రాయం కోరడం, ఆ తర్వాత బిల్లును పార్లమెంట్ ముందు పెట్టడం జరుగుతారుు. అయితే బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్ర శాసనమండలి రద్దవుతుందని చెబుతున్నారు. కొత్తగా మళ్లీ శాసన మండలి ఏర్పాటు కావాలంటే, ఉభయు రాష్ట్రాల అసెంబ్లీల్లో వేరువేరుగా ప్రత్యేక తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపవలసి ఉంటుంది.
అసెంబ్లీలో మూడింట రెండొంతుల మంది తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాల్సి ఉంటుంది. అనంతరం కొత్తగా శాసనమండలి ఏర్పాటై, శాసనవుండలికి మళ్లీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇదే 175 మంది సభ్యులుండే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర ప్రాంతాలు) అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే, పార్లమెంటు బిల్లు ద్వారా శాసనమండలి ఏర్పాటు అవుతుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 మంది శాసనసభ్యులున్నారు. శాసనమండలి ఏర్పాటుకు కనిష్టంగా 40 మంది సభ్యులుండాలి. ఆ మేరకు శాసనసభలో మూడోవంతుగా ఆ సభ్యుల సంఖ్య ఉండాలంటే అసెంబ్లీస్థానాలు 120గా ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో శాసనవుండలి పరిస్థితి ప్రశ్నార్థకవువుతుందని, అయితే, ఆంగ్లో ఇండియన్, నామినేటెడ్ సభ్యులను కలుపుకుంటే ఆ సంఖ్య సరిపోతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.
శాసనమండలి ఇక రద్దయినట్లే
Published Fri, Oct 4 2013 2:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement