కొత్త కొత్త ఫీచర్లతో ఎల్జీ ఫోన్ | LG V20 to Be World's First Smartphone With Quad DAC | Sakshi
Sakshi News home page

కొత్త కొత్త ఫీచర్లతో ఎల్జీ ఫోన్

Aug 11 2016 3:01 PM | Updated on Sep 4 2017 8:52 AM

కొత్త కొత్త ఫీచర్లతో ఎల్జీ ఫోన్

కొత్త కొత్త ఫీచర్లతో ఎల్జీ ఫోన్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షెన్ 7.0 నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ తమదేనంటూ తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 మొదటి ఫీచర్ను విడుదల చేసిన ఎల్జీ, మరో ఫీచర్ను రివీల్ చేసేసింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షెన్ 7.0 నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ తమదేనంటూ తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 మొదటి ఫీచర్ను విడుదల చేసిన ఎల్జీ, మరో ఫీచర్ను రివీల్ చేసేసింది. తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 క్వాడ్ డాక్ ఫీచర్తో రాబోతుందని వెల్లడించింది. అయితే ఆ ఫీచర్తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్ఫోన్ కూడా తమదేనని ప్రకటించింది. 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్జీ వీ20 అందించగలదని తెలిపింది. వీ10 స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న రెగ్యులర్ డాక్కు అప్గ్రేడ్గా వీ20 స్మార్ట్ఫోన్ను క్వాడ్ డాక్తో తీసుకురాబోతున్నామని వెల్లడించింది.  

మంచి ఆడియో అనుభూతిని వీ20 యూజర్లకు అందించడానికి అధిక ఫర్ఫార్మెన్స్ అనలాగ్, ఆడియో డివైజ్లకు అధిపతైన ఈఎస్ఎస్ టెక్నాలజీతో కలిసి పనిచేసి, ఈ క్వాడ్ డాక్ను అభివృద్ధి చేసినట్టు ఎల్జీ వెల్లడించింది. ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ  ఆడియోను అందించేందుకు కృషిచేశామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కంపెనీ ప్రెసిడెంట్ జునో చూ తెలిపారు. సెప్టెంబర్ 6న ఈ ఫోన్ను ఎల్జీ ఆవిష్కరించనుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 కు పోటీగా ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావాలని ఎల్జీ వ్యూహాలు రచిస్తోంది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement