LG V20
-
ఎల్జీ వీ20 ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ భారత్ మార్కెట్లోలోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి కానుకగా...ఎల్జీ భారత వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. 'సెలబ్రేటింగ్ టుగెథర్నెస్' క్యాంపెయిన్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్లో భాగంగా సరికొత్త ఆండ్రాయిడ్ నోగట్ 7.0తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఎల్జీ వీ20పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ 54,999 రూపాయలకు లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్లైన్ స్టోర్లలలో రూ.44,990 ధరకు అందుబాటులో ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 39,990కే అందుబాటులో ఉంది. వీ20 స్మార్ట్‌ఫోన్‌పై ప్రకటించిన ఈ ఆఫర్ గడువు మే 31 ముగియనుంది. 5.7 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ప్లే, సెకండరీ డిస్ప్లే, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 16ఎంపీ, 8ఎంపీలతో రెండు వెనుక కెమెరాలు, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా దీనిలో ఫీచర్లు. ఒక్క ఎల్జీ వీ20 స్మార్ట్ ఫోన్‌పైనే కాక, కంపెనీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కండీషనర్లపై కూడా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. కంపెనీ అన్ని ఉత్పత్తులపైనా 20వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్, సలుభతరమైన ఈఎంఐ ఆప్షన్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్లను ఎల్జీ ప్రకటించింది. -
కొత్త కొత్త ఫీచర్లతో ఎల్జీ ఫోన్
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ తాజా వెర్షెన్ 7.0 నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ తమదేనంటూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ వీ20 మొదటి ఫీచర్‌ను విడుదల చేసిన ఎల్జీ, మరో ఫీచర్‌ను రివీల్ చేసేసింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్ వీ20 క్వాడ్ డాక్ ఫీచర్‌తో రాబోతుందని వెల్లడించింది. అయితే ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ కూడా తమదేనని ప్రకటించింది. 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్జీ వీ20 అందించగలదని తెలిపింది. వీ10 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న రెగ్యులర్ డాక్‌కు అప్‌గ్రేడ్‌గా వీ20 స్మార్ట్‌ఫోన్‌ను క్వాడ్ డాక్‌తో తీసుకురాబోతున్నామని వెల్లడించింది. మంచి ఆడియో అనుభూతిని వీ20 యూజర్లకు అందించడానికి అధిక ఫర్ఫార్మెన్స్ అనలాగ్, ఆడియో డివైజ్‌లకు అధిపతైన ఈఎస్ఎస్ టెక్నాలజీతో కలిసి పనిచేసి, ఈ క్వాడ్ డాక్‌ను అభివృద్ధి చేసినట్టు ఎల్జీ వెల్లడించింది. ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ ఆడియోను అందించేందుకు కృషిచేశామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కంపెనీ ప్రెసిడెంట్ జునో చూ తెలిపారు. సెప్టెంబర్ 6న ఈ ఫోన్‌ను ఎల్జీ ఆవిష్కరించనుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 కు పోటీగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ఎల్జీ వ్యూహాలు రచిస్తోంది. -
శాంసంగ్ గెలాక్సీకి పోటీగా ఎల్జీ ఫోన్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్7 కు పోటీగా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సెప్టెంబర్ లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన వీ10 ఫోన్ల విజయంతో, వీ20 డివైజ్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఈ కొత్త డివైజ్‌లు కంపెనీని నిరాశపరుస్తున్న అమ్మకాల నుంచి బయటపడేస్తాయని.. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పోటీగా నిలబడతాయని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ తాజా వెర్షన్ నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ ఇదే కాబోతుందని తెలిపింది. అయితే ఈ వీ20 డివైజ్ ఎలా ఉండబోతుంది..ఏ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.. ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎల్జీకి ప్రత్యర్థులుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ రారాజులు శాంసంగ్, యాపిల్లు తమ కొత్త డివైజ్‌లను త్వరలోనే మార్కెట్లోకి ఆవిష్కరించబోతున్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన తర్వాతి గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లోకి తీసుకురాబోతుండగా.. యాపిల్ ఇంక్ తన కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనుంది. ఎల్జీ కలిగిఉన్న రెండు ప్రీమియం ఫోన్ సిరీస్‌లు, మార్చిలో లాంచ్ చేసిన జీ5 ఫోన్, ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో అమ్మకాలు నమోదుచేసి కంపెనీని నిరాశపర్చాయి. దీంతో ఈ దక్షిణ కొరియా దిగ్గజం వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కాలంలో కూడా నిర్వహణ నష్టాలనే నమోదుచేసింది. వీ10 డివైజ్ విజయంతో, కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని ఎల్జీ ప్రకటించింది. ఈ కొత్త ప్రొడక్ట్, మూడో త్రైమాసికంలో తమ ప్రదర్శనను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది.