రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి | Madhya Pradesh: 15 members of two wedding parties die in separate accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

Published Wed, May 10 2017 8:07 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

ధార్‌/ షియోపూర్‌: మధ్యప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పెళ్లి బృందాలకు చెందిన 15 మంది మృతిచెందారు. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో పెళ్లికొడుకు కూడా ఉన్నాడు. ఖార్గోన్‌ జిల్లాలోని ఆగ్రా– ముంబై జాతీయ రహదారి మీద జరిగిన ప్రమాదంలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. కారును కంటైనర్‌ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ ఇండోర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ధార్‌ జిల్లాలోని సిర్పీ గ్రామంలో వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరో ప్రమాదం షియోపూర్‌ జిల్లాలో జరిగింది. బాధితులంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో 6 మంది అక్కడికక్కడే చనిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement