మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
ముంబై: మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి దేవంద్ర ఫడణ్ వీస్ తన కేబినెట్ లోని పది మంది మంత్రులకు ఆదివారం శాఖలు కేటాయించారు. హోమ్, పట్టణాభివృద్ధి, హౌసింగ్, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. శివసేనకు ఇచ్చేందుకే ఈ శాఖలను ఫడణ్ వీస్ తన వద్ద అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఏక్‌నాథ్ ఖడ్సే: రెవెన్యూ, మైనార్టీల అభివృద్ధి , వక్ఫ్, ఎక్సైజ్, వ్యవసాయం, పశుసంవర్ధకం
సుధీర్ మునగంటివార్: ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాలు, అటవీ శాఖ
వినోద్ తావ్డే: పాఠశాల విద్య, క్రీడలు, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య, మరాఠీ భాష, సాంస్కృతిక వ్యవహారాలు
ప్రకాశ్ మెహతా: పరిశ్రమలు, మైనింగ్, శాసనసభ వ్యవహారాలు
చంద్రకాంత్ పాటిల్: సహకార, మార్కెటింగ్, టెక్స్టైల్
పంకజా ముండే: గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమం
విద్యా ఠాకూర్(సహాయ మంత్రి): గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమం
విష్ణు సావరా: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం
దిలీప్ కాంబ్లే: (సహాయ మంత్రి): గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం