Cabinet portfolio
-
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు.(మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం) సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.(కొత్త మంత్రులకు జనసేన ఎమ్మెల్యే అభినందనలు) -
ఎన్సీపీకే పెద్ద పీట
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు శాఖల్ని కేటాయించారు. ముఖ్యమైన శాఖలెన్నో సంకీర్ణ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకే దక్కాయి. శాఖల కేటాయింపులో మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన మూడు రోజులకి కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఆయన పార్టీ సహచరుడు అనిల్ దేశ్‌ముఖ్‌కు హోంశాఖని కేటాయించినట్టు ఆదివారం ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన తరఫున తొలిసారిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకి పర్యావరణం, పర్యాటకం, ప్రొటోకాల్ వ్యవహారాల శాఖ దక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరాత్‌కు రెవెన్యూ, అశోక్ చవాన్‌కు ప్రజాపనుల శాఖలు దక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ధనుంజయ్ ముండే, జితేంద్ర అవ్హాద్‌లకు వరసగా సామాజిక న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖలు కేటాయించారు. దీంతో ఎన్సీపీకే కీలక శాఖలు దక్కినట్టయింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సాధారణ పరిపాలన, ఐటీ, న్యాయశాఖల్ని తన వద్ద ఉంచుకున్నారు. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిందేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ప్రభుత్వం పంపిన ఈ శాఖలకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరాత్ కారణమని కొందరు నేతలు నిందిస్తున్నారు. ఎన్సీపీతో పోలిస్తే అప్రాధాన్య శాఖలు కేటాయించారని అంటున్నారు. మరికొందరు సంకీర్ణ భాగస్వామ్య పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధ్యక్షుడు పవార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, గృహనిర్మాణం, రవాణా శాఖల్లో కనీసం రెండయినా కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా శివసేన, ఎన్సీపీ తిరస్కరించడంతో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాజుకుంటోంది. కాగా, శివసేన పార్టీని వీడడం లేదని మంత్రి అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను శివసేనతోనే కొనసాగుతానన్నారు. -
మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
ముంబై: మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి దేవంద్ర ఫడణ్ వీస్ తన కేబినెట్ లోని పది మంది మంత్రులకు ఆదివారం శాఖలు కేటాయించారు. హోమ్, పట్టణాభివృద్ధి, హౌసింగ్, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. శివసేనకు ఇచ్చేందుకే ఈ శాఖలను ఫడణ్ వీస్ తన వద్ద అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏక్నాథ్ ఖడ్సే: రెవెన్యూ, మైనార్టీల అభివృద్ధి , వక్ఫ్, ఎక్సైజ్, వ్యవసాయం, పశుసంవర్ధకం సుధీర్ మునగంటివార్: ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాలు, అటవీ శాఖ వినోద్ తావ్డే: పాఠశాల విద్య, క్రీడలు, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య, మరాఠీ భాష, సాంస్కృతిక వ్యవహారాలు ప్రకాశ్ మెహతా: పరిశ్రమలు, మైనింగ్, శాసనసభ వ్యవహారాలు చంద్రకాంత్ పాటిల్: సహకార, మార్కెటింగ్, టెక్స్టైల్ పంకజా ముండే: గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమం విద్యా ఠాకూర్(సహాయ మంత్రి): గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమం విష్ణు సావరా: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం దిలీప్ కాంబ్లే: (సహాయ మంత్రి): గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం