మలేషియా విమానం మాల్దీవ్స్ వైపు వెళ్లిందా? | Maldives people claim to have seen the ill-fated flight | Sakshi
Sakshi News home page

మలేషియా విమానం మాల్దీవ్స్ వైపు వెళ్లిందా?

Published Wed, Mar 19 2014 11:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

మలేషియా విమానం మాల్దీవ్స్ వైపు వెళ్లిందా?

మలేషియా విమానం మాల్దీవ్స్ వైపు వెళ్లిందా?

మలేషియా నుంచి బయలుదేరి మధ్యలోనే మాయమైన ఎంహెచ్ 320 విమానం మాల్దీవ్స్ లో కనిపించిందా?


విమానం మాయమైన మార్చి 6 నాడే మాల్దీవ్స్ లో చాలా తక్కువ ఎత్తునుంచి ఒక జంబోజెట్ విమానం వెళ్లినట్టు అక్కడి కుడా హువాధూ ద్వీసం ప్రజలు చెబుతున్నారు. ఈ కథనం స్థానిక హావీరు న్యూస్ లో ప్రచురితం అయింది కూడా.


చాలా తక్కువ ఎత్తు నుంచి ఒక విమానం వెళ్లడం చూశామని చాలా మంది స్థానికులు చెబుతున్నారు. ఆ విమానం తెల్లగా ఉందని, దానిపైఎర్ర చారలు పెయింట్ చేశారని చెబుతున్నారు. మలేషియన్ విమానాల రంగు కూడా ఇదే.


'విమానం ఎంత కింద నుంచి వెళ్లిందంటే దాని తలుపులు, కిటికీలను సైతం గుర్తించగలిగాం. చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చింది' అని స్థానికులు అంటున్నారు.

ఎన్నెన్నో ప్రశ్నలు? ఎంతెంతో కన్ఫ్యూజన్
రాడార్ల దృష్టి నుంచి తప్పించుకోవాలంటే విమానాలు చాలా తక్కువ ఎత్తున ఎగరాల్సి ఉంటుంది. అయిదు వేల అడుగుల కన్నా తక్కువ ఎత్తున వెళ్తేనే రాడార్ల డేగ కళ్ల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి మలేషియన్ పైలట్లు విమానాన్ని అంత తక్కువ ఎత్తునుంచి తీసుకువెళ్లారా? అందరూ భావిస్తున్నట్టు విమాన క్యాప్టెన్, కో పైలట్లే హైజాకర్లుగా మారి చేను మేసిన కంచెల్లా పనిచేశారా? లేక విమానంలోని పరికరాలు సరిగ్గా పనిచేయక, విమానాన్ని ఎదో ఒక రకంగా సురక్షితంగా దించేందుకు పైలట్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు విమానం కాక్ పిట్ లో ఉన్న వారు విలన్లా లేక హీరోలా? కో పైలట్ ఫారిక్ అబ్దుల్ హమీద్ ప్రేమలో పడ్డాడని, ఇంకో విమానంలో కో పైలట్గా ఉన్న నిద్రా రామ్లీ అనే అమ్మాయికి ప్రపోజ్ కూడ చేశాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని, అలాంటి వాడు విలన్ గా మారాల్సిన అవసరం ఏముందని కూడా అతని మిత్రులు వాదిస్తున్నారు.

మాకూ విమానం కనిపించిందోచ్!
తమాషా ఏమిటంటే మాయమైన విమానం కోసం వెతుకుతున్న 26 దేశాల్లో మాల్దీవ్స్ లేదు. కాబట్టి విమానం మాల్దీవ్స్ దాటి మరే అజ్ఞాత ద్వీపానికైనా వెళ్లిందా? లేక సముద్రంలో కుప్పకూలిపోయిందా? మలేషియా, చైనా సహా 26 దేశాలు మలక్కా జలసంధి దగ్గర వెతకడం నీళ్లు లేని చోట గాలం వేయడం లాంటిదేనా?


మరో వైపు థాయ్ లాండ్ ఏవియేషన్ అధికారులు కూడా సరికొత్తగా గొంతు విప్పి ట్రాన్స్పాండర్ ని ఆపేసిన కొద్ది సేపటి వరకూ తమ రేడార్లలో విమానం మినుకుమినుకుమని కనిపించిందని, విమానం ఆగ్నేయాసియాలోని మలక్కా జలసంధి వైపు వెళ్లిందని ప్రకటించింది. ఈ వివరాలను తాము ఇన్నాళ్ల వరకూ గమనించలేదని, పాత రికార్డులు తిరగేస్తే ఈ డేటా కనిపించి డంగైపోయామని వారంటున్నారు.
దీంతో ఇప్పుడు అన్వేషణ చేస్తున్న వారు ఎటు వెతకాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement