సిలిగురి: పశ్చిమబెంగాల్లో ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మహబిరిస్తాన్ వద్ద ఓ యువకుడు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా టాయ్ ట్రైన్ వచ్చి ఢీకొనడంతో అతడి తల మొండెం విడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. రైలు వేగం పుంజుకుందని తెలిసినప్పటికీ కూడా అతడు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడు వివరాలు తెలియరాలేదు.