
గవర్నర్ ఎదుటే కిరోసిన్ పోసుకుని..
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ నివాసం ఎదుట ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకోవడమే కాకుండా చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు అతడిని నిప్పు అంటించుకోకుండా నిలువరించి చేతికి కట్లు కట్టి ఆస్పత్రికి తరలించారు. అతడి డిమాండ్ ఏమిటి? ఎందుకు అలా చేశాడనే అంశంపై మాత్రం ఇంకా వివరాలు తెలియరాలేదు.