
అమితాబ్ షూటింగ్ కు సమీపంలో కాల్పులు
ముంబై: అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ స్పాట్ కు సమీపంలో జరిగిన కాల్పులు ముంబైలో సంచలనం రేపాయి. ముంబై ఫిల్మ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం ఫిల్మ్ సిటీలోని కాళియా మైదాన్ లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాజు షిండే అనే సెక్యురిటీ కాంట్రాక్టర్ గాయపడ్డాడు. రెండు బైకులపై వచ్చిన దుండగులు ఈ కిరాతకానికి ఒడిగట్టారు.
దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ రాజు షిండే పొట్టలో దిగింది. అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దుండగులు ఒక బైకును సంఘటనా స్థలంలో వదిలేసి పారిపోయారు.
తాము షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి 20 అడుగుల దూరంలో ఈ గ్యాంగ్ వార్ జరిగిందని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
The 1873 - Okay !! Shooting at Film City .. and a gang war shootout 20 feet from where we are ... !!1 dead .. cops all over ..
— Amitabh Bachchan (@SrBachchan) May 22, 2015