
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కారు ప్రమాదం జరిగిందని, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తనకెళ్లాంటి ప్రమాదం జరుగలేదని అమితాబ్, ఆ రిపోర్టులను కొట్టిపారేశారు. తాను బాగున్నానంటూ ట్విట్టర్ ద్వారా తమ అభిమానులకు తెలియజేశారు. ''నన్ను క్షేమాన్ని కోరుకునే అభిమానులకు, మీడియాకు నేను తెలియజేస్తున్నా. కోల్‌కత్తాలో జరిగిన కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా అన్నది అవాస్తవం. అసలు అక్కడ ప్రమాదమే జరుగలేదు. నేను చాలా బాగున్నా'' అని అమితాబ్ ట్వీట్ చేశారు.
23వ కోల్‌కత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన అమితాబ్ బచ్చన్ కారు ప్రమాదానికి గురయ్యారని వార్తలు వెలువడ్డాయి. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, అమితాబ్ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ కారు వెనక్కి చక్రం అకస్మాత్తుగా ఊడిపోయిందంటూ రిపోర్టులు పేర్కొన్నాయి. ముంబై విమానం అందుకోవడం కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న క్రమంలో డఫెరిన్ రోడ్డులో శనివారం ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపాయి. కానీ తనకు అసలు కారు ప్రమాదమే జరుగలేదంటూ అమితాబ్ క్లారిటీ ఇచ్చేశారు.
T 2713 - I am informed by concerned well wishers and media, that I had a close escape from a car accident in Kolkata .. that is incorrect .. there has been no accident .. I am well .. pic.twitter.com/FLUnlRiIH6
— Amitabh Bachchan (@SrBachchan) November 16, 2017
Comments
Please login to add a commentAdd a comment