
'బొగ్గు' సమన్లపై సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
కోల్ గేట్ కుంభకోణంలో ప్రత్యేక విచారణకోర్టు జారీచేసిన సమన్లు రద్దుచేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన తరఫు లాయయర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. గత జనవరిలో మన్మోహన్ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణకై ఏర్పాటయిన ప్రత్యేక కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన తుదిచార్జిషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8 లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.