మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల? | Microsoft likely to name Satya Nadella as next CEO: report | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల?

Jan 31 2014 11:04 AM | Updated on Sep 2 2017 3:13 AM

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల?

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో సీఈవో పదవి తెలుగు వ్యక్తికి దక్కనుంది.

న్యూయార్క్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో సీఈవో పదవి తెలుగు వ్యక్తికి దక్కనుంది. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా మన హైదరాబాదీ సత్య నాదెళ్ల(46) నియమితులయ్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ఆయన నియామకం దాదాపు ఖాయమయిందని తెలిపాయి. సీఈవో ఎంపిక కోసం ఐదు నెలల పాటు సాగించిన కసరత్తు ముగిసిందని వెల్లడించాయి. సుదీర్ఘ కాలంగా సీఈవోగా స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముంది. సత్య నాదెళ్ల నియామకం ఖరారయితే మైక్రోసాఫ్ట్కు ఆయన మూడో సీఈవో అవుతారు.

హైదరాబాద్‌కి చెందిన సత్య.. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ వచ్చే ఏడాదిలోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement