బ్యాంకర్ల బదిలీల్లో రాజకీయ పైరవీలు వద్దు
న్యూఢిల్లీ: బ్యాంకర్ల నియామకాలు, బదిలీల్లో రాజకీయ పైరవీలు ఎంతమాత్రం ఆమోదనీయం కాదని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. నియామకం లేదా బదిలీ వంటి అంశాల్లో రాజకీయ పలుకుబడిని వినియోగించుకోరాదని ఉద్యోగులను హెచ్చరిం చింది. ఇలాంటి అక్రమ బాట పట్టినట్లు రుజు వైతే... తత్సంబంధ ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా పేర్కొంది. బదిలీలు లేదా పోస్టింగులకు సంబంధించి పారదర్శకమైన వ్యవస్థను రూపొందించుకోవాలని బ్యాంకులకు సలహా ఇచ్చింది. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించడానికి సైతం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలనీ సూచించింది. బ్యాంక్ సీఎండీలు ఎటువంటి భయ, పక్షపాతాలూ లేకుండా పనిచేయాలని గత వారం జరిగిన ఒక అత్యున్నత స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రిత్వశాఖ తాజా సూచనలు చేసింది.