'పాకిస్థానీలు కనబడితే దంచుడే' | MNS strong warning to Pakistani actors in India | Sakshi
Sakshi News home page

'పాకిస్థానీలు కనబడితే దంచుడే'

Published Fri, Sep 30 2016 5:00 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

'పాకిస్థానీలు కనబడితే దంచుడే' - Sakshi

'పాకిస్థానీలు కనబడితే దంచుడే'

ముంబై: పాకిస్థాన్ పై ప్రతీకారం విషయంలో సరిహద్దుల్లో కన్నా ముంబైలో ఉద్రిక్తతను పెంచుతోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) మరో అడుగు ముందుకువేసి తీవ్ర హెచ్చికలు చేసింది. పాకిస్థాన్ నటులు కనబడితే దాడులు చేస్తామని, ఆయా సినిమాల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని ఎంఎన్ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పాక్ నటులు వీసాలు, వర్క్ పర్మిట్లు తీసుకొని వచ్చారన్న సల్మాన్ ఖాన్ కు సైతం కౌంటర్ ఇచ్చారు. (వాళ్లు వర్క్ పర్మిట్లు, వీసాలతో వచ్చారు: సల్మాన్)

'చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఉప్పటికిప్పుడైతే పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తాం. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటాం' అని అమేయ్ ఖొప్కర్ అన్నారు.

ఇదే వివాదంపై దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ స్పందిస్తూ.. నిర్మాణంలో ఉన్న సినిమాల నుంచి తప్పుకోవడంలో పాక్ నటుల తప్పేమీ లేదని, వీళ్ల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని అన్నారు. నిజానికి భారతీయులకు పాకిస్థానీయుల పట్లగానీ, అక్కడివాళ్లకు ఇక్కడివాళ్లపైగానీ ఎలాంటి విద్వేషాలు లేవని, వివాదాలు ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలని శ్యామ్ బెనగల్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement