
ప్రేమ మత్తులో ఆ తల్లి ఎంత పని చేసింది..!
రామకుప్పం(చిత్తూరు): కామంతో కళ్ళు మూసుకు పోయి ఓ తల్లి కన్న బిడ్డలనే హతమార్చింది. ఆమెను, ప్రియుడిని పోలీసులు కటకటాల పాలు చేసిన సంఘటన మండలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలివి.. కవ్వంపల్లె గ్రామానికి చెందిన వివాహిత పవిత్ర భర్త ఉన్నా కూడా మరో యువకుడితో వివాహేతర సంబంధం సాగించింది.
అంతటితో ఆగకుంగా ప్రియుడితో కలిసి పరారైంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పవిత్రను వెతికి పట్టుకొని ప్రియుడు వేమన్నకు పోలీసులు తమదైన శైలీలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. రహస్యంగా ప్రియుడితో కలుస్తూ వచ్చింది. అతడి సలహాతో తన ఇద్దరు బిడ్డలను ఇంట్లో ఉరివేసి చంపేసి ప్రియుడి వద్దకు పారిపోయింది.
కుటుంబీకులు బిడ్డలను చంపి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పవిత్ర ప్రియుడు వేమన్న కోసం బిడ్డలను తానే చంపానని విచారణలో ఒప్పుకుంది. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.