
హీరోకు ముద్దుపెట్టబోయింది!
'నాగిని' సీరియల్‌తో బుల్లితెరపై సూపర్‌హిట్ అయిన మౌనీ రాయ్ తెలుసు కదా. ఇప్పుడీ సుందరి సూపర్‌నైట్ విత్ ట్యూబ్‌లైట్ షోలో హల్‌చల్ చేయబోతున్నది. టాప్ కమెడియన్ కపిల్ శర్మ షోకు ఝలక్ ఇచ్చి మరీ.. ఆయన విరోధిగా మారిన సునీల్ గ్రోవర్ సూపర్‌నైట్ షోను సల్మాన్ ఎంచుకున్నాడు. తన తాజా సినిమా 'ట్యూబ్‌లైట్'ను ప్రమోట్ చేసేందుకు సూపర్‌నైట్ షోను వేదికగా మార్చుకున్నాడు. త్వరలోనే ఈ ప్రత్యేక షో సోనీ టీవీలో రానుంది.
ఈ షోలో సల్మాన్‌ఖాన్ వీరాభిమాని అయిన మౌనీరాయ్ కూడా పాల్గొంటున్నది. సల్మాన్ ఐటం పాటలకు స్పెషల్ డ్యాన్సులతో అలరించనుంది. ఈ షోకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. షోలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా వెనుకకు వెళ్లిన ఆమె దాదాపుగా సల్మాన్‌కు ముద్దు ఇవ్వబోయి.. సర్దుకుంది. ఆమె సిగ్గుపడుతూ పక్కకు తప్పుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.