'పుతిన్ కుమార్తెను కోడలు చేసుకోవాలనుకున్నారు' | Muammar Gaddafi tried to marry son to Putin's daughter | Sakshi
Sakshi News home page

'పుతిన్ కుమార్తెను కోడలు చేసుకోవాలనుకున్నారు'

Published Fri, Jan 1 2016 1:02 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

'పుతిన్ కుమార్తెను కోడలు చేసుకోవాలనుకున్నారు' - Sakshi

'పుతిన్ కుమార్తెను కోడలు చేసుకోవాలనుకున్నారు'

ట్రిపోలి: లిబియా మాజీ నియంత ముమ్మార్ గడాఫీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఆయన మాజీ సలహాదారు మహ్మద్ అబ్దుల్ ఈల్ మొతలెబ్ ఆల్-హౌని వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో వియ్యం అందుకోవాలని గడాఫీ ప్రయత్నించారని తెలిపారు. 'పొలిటికల్ మ్యారేజీ'తో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని ఆయన యత్నించారని పేర్కొన్నారు. తన రెండో కుమారుడు సయీఫ్ అల్ ఇస్లామ్ కు పుతిన్ కుమార్తెల్లో ఒకరినిచ్చి పెళ్లిచేయాలని భావించారు.

తన కుమారుడితో పుతిన్ కుమార్తెతో వివాహం జరిపిస్తే రష్యా, లిబియా మధ్య సంబంధాలు పటిష్టమవుతాయన్న భావనతో పుతిన్ ను గడాఫీ సంప్రదింపులు జరిపారని చెప్పారు. 'తన కుమారుడిని అల్లుడిని చేసుకోవాలని పుతిన్ గడాఫీ కోరారు. ఆయనతో వియ్యం అందుకునేందుకు పుతిన్ వెనకడుగు వేశారు. సయీఫ్ అల్ ఇస్లామ్ గురించి తమ కుమార్తెలకు ఏమీ తెలియదని పుతిన్ తప్పించుకున్నారు' అని ఆల్-హౌని వెల్లడించారు.

కొన్ని దశాబ్దాలు లిబియాను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన గడాఫీ 2011, అక్టోబర్ లో తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యారు. ఆయన కుమారుడు సయీఫ్ అల్ ఇస్లామ్ కు ట్రిపోలి కోర్టు ఈ ఏడాది జూలైలో మరణదండన విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement