94 కి చేరిన కల్తీ మద్యం మృతులు | Mumbai hooch tragedy toll climbs to 94 | Sakshi
Sakshi News home page

94 కి చేరిన కల్తీ మద్యం మృతులు

Published Sun, Jun 21 2015 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

94 కి చేరిన కల్తీ మద్యం మృతులు

94 కి చేరిన కల్తీ మద్యం మృతులు

ముంబై: ముంబైలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆదివారం 94కి పెరిగింది. మరో 45 మంది నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనపై నేర విభాగం  దర్యాప్తు జరుపుతుందని తెలిపారు. కల్తీ సారాకి బాధ్యులుగా భావిస్తున్న ప్రాన్సిస్ థామస్(46), సలీం మహబూబ్(39) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరిందని చెప్పారు.

కల్తీ మద్యంతో పలువురికి సంబంధాలున్నాయని వారి కోసం ముంబై... పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. బుధవారం రాత్రి ముంబైలో మల్వాణి ప్రాంతంలోని ఓ బార్లో కల్తీ మద్యం సేవించి పలువురు తీవ్ర అస్వస్తతకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా కల్తీ సారాను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఎనిమిది పోలీసు అధికారులపై నగర పోలీసు కమిషనర్ వేటు వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement