hooch tragedy
-
‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’
చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు..
పాట్నా: 72 మంది చనిపోయన బిహార్ కల్తీ మద్యం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు హోమియోపతి మందులను ఉపయోగించి విషపూరిత లిక్కర్‌ను తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో తేలింది. ప్రధాన సూత్రదారి సహా మొత్తం ఐదుగుర్ని సిట్ పోలీసు బృందం శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడు రాజేశ్ సింగ్ సహా శైలేంద్ర రాయ్, సోనుకుమార్, అర్జున్ మహ్తో, సంజయ్ మహ్తో ఉన్నారు. వీరంతా చాలా కాలంగా కల్తీమద్యం దందా నడుపుతున్నారు. ముఖ్యంగా రాజేశ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి 90 శాతం ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందులను భారీగా కొనుగోలు చేసి, వాటిని కల్తీ మద్యం తయారీకి ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. నకిలీ కస్టమర్ల పేర్లను ఉపయోగించి మందులను తీసుకొచ్చాడని వెల్లడించారు. ఈ కల్తీమద్యాన్ని తాగి నిందితుల్లోనే ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పోలీసులు వివరించారు. కల్తీమద్యం సరఫరా కేసులో రాజేశ్ గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. బిహార్ ఛప్రా జిల్లాలో కల్తీమద్యం తాగి వారాల వ్యవధిలోనే 72 మంది చనిపోయారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. సీఎం నితీశ్ కుమార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీమద్యం తాగి చనిపోయిన వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని నితీశ్ తేల్చిచెప్పారు. తాగితే చస్తారని ప్రజలను హెచ్చరించారు. చదవండి: శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. 8 మంది భక్తులు దుర్మరణం -
తాగి చనిపోతే పరిహారం ఇవ్వాలా?: సీఎం నితీశ్
పాట్నా: బిహార్ సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. ఈ విషయంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. అలాంటి వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్యం తాగితే చనిపోతారని, తాగాలని ప్రోత్సాహించే వారు మీకు ఎలాంటి మేలు చేయరని సీఎం సభలో అన్నారు. #WATCH | "No compensation will be given to people who died after drinking...We have been appealing- if you drink, you will die...those who talk in favour of drinking will not bring any good to you...", said CM Nitish Kumar in assembly earlier today. (Source: Bihar Assembly) pic.twitter.com/zquukNtRIA — ANI (@ANI) December 16, 2022 అయితే నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్‌లో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం 2016 నుంచి అమలు అవుతున్నప్పటికీ.. అక్రమంగా కొందరు సారా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగితే చస్తారని సీఎం వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి
పాట్నా: కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోగా 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో చాలా మంది కంటిచూపు కూడా పోగొట్టుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారకులను గుర్తించేందుకు మకేర్, మర్హౌరా, భెల్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు జరుపుతున్నారు. కల్తీ సారాను తయారీ, విక్రయించినందుకు ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు. కల్తీ సారా తాగి ఇద్దరు మరణించినట్లు మరికొంతమంది అనారోగ్యానికి గురైనట్లు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. మకేర్ర్ పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీసారా బాధితుల ఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బాధితులంతా ఈ నెల 3న శ్రావణమాస పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం మత్తు పదార్థాలను సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. చదవండి: ప్రియాంక గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వీడియో దృశ్యాలు.. పోలీసులు, ఎక్సైజ్, వైద్యాధికారుల బృంధం ఘటన స్థలానికి చేరుకొని బాధితులను సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని పాట్నాలోని పిఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తొమ్మిది మంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. అంతేగాక అధికారులకీ విషయం తెలియక ముందే ఒకరిని దహనం చేశారని తెలిపారు. మరో 12 మంది పన్నెండు మంది ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు కల్తీ మద్యం విక్రయాన్ని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు స్థానిక పోలీస్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ ప్రభుత్వం 2016లో బిహార్‌లో మద్యం నిషేధించింది. అయితే 2021 నవంబర్ నుంచి జరుగుతున్న కల్తీ మద్యం ఘటనల్లో 50 మందికి పైగా చనిపోయారు. -
పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
పట్నా: బిహార్‌లో దీపావళి పండుగ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ చంపారన్ ప్రాంతంలోని.. తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 24కి పెరిగింది. బాధితులంతా.. బుధవారం స్థానికంగా ఉన్న.. ఒక దుకాణంలో.. మద్యంసేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇప్పటికే.. ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా, మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్సపోందుతూ మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో మరికొందరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బిహార్ సీఎం నితిష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందిపై అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
కల్తీ మద్యం ఘటనపై స్పందించిన ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణించిన ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విషాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు యూపీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రియాంక కోరారు. కల్తీ మద్యం సేవించిన ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో వందకు పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తోడ్పాటు లేనిదే కల్తీ మద్యం వ్యాపారం ఈస్దాయిలో జరగదని మండిపడ్డారు. యూపీలోని సహరన్పూర్, ఖుషీనగర్ జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్‌లో కల్తీ మద్యం సేవించి ఇటీవల పలువురు మరణించిన సంగతి తెలిసిందే. -
కల్తీ సారాకు ఐదుగురు బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా, కరోవన్ ప్రాంతంలో కల్తీ సారాయి తాగి ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన సోమవారం వెలుగుచూసింది. మృతులు కిషన్ పాల్, శాంట్ లాల్, కల్లు, జమునా, హనుమాన్‌గా పోలీసులు గుర్తించారు. దొంగసారాయికి బానిసైన మరో ముగ్గురు చావుబ్రతుకల మధ్య కాన్పూర్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపారు. కాగా అక్రమంగా అమ్ముతున్న దొంగసారాయి అమ్మకాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది మంది ఎక్సైస్ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎస్పీ మహేంద్ర పాల్‌ను డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉన్నవ్ జిల్లా ఎస్పీగా చిత్రకూట్ పవన్‌కు బాధ్యతలు అప్పగించినట్టు ప్రిన్సిపల్ హోం సెక్రటరీ దిబాషిష్ పండా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మెజిస్టీరియల్ విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. అంతేకాక రాష్ట్రంలో అక్రమంగా కల్తీ సారాయిని తయారుచేసి, అమ్ముతున్న దుకాణాలపై దాడులు నిర్వహించాలని అధికారులను అదేశించినట్టు ప్రిన్సిపల్ హోం సెక్రటరీ తెలిపారు. కాగా, ఈ ఘటనపై నగరం మేజిస్ట్రేట్ విచారించి, సంబంధిత రిపోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి దాఖలు చేయాల్సిందిగా అదేశించామని ఉన్నవ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌమ్యా అగర్వాల్ అన్నారు. -
94కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య
-
94 కి చేరిన కల్తీ మద్యం మృతులు
ముంబై: ముంబైలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆదివారం 94కి పెరిగింది. మరో 45 మంది నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనపై నేర విభాగం దర్యాప్తు జరుపుతుందని తెలిపారు. కల్తీ సారాకి బాధ్యులుగా భావిస్తున్న ప్రాన్సిస్ థామస్(46), సలీం మహబూబ్(39) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరిందని చెప్పారు. కల్తీ మద్యంతో పలువురికి సంబంధాలున్నాయని వారి కోసం ముంబై... పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. బుధవారం రాత్రి ముంబైలో మల్వాణి ప్రాంతంలోని ఓ బార్లో కల్తీ మద్యం సేవించి పలువురు తీవ్ర అస్వస్తతకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా కల్తీ సారాను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఎనిమిది పోలీసు అధికారులపై నగర పోలీసు కమిషనర్ వేటు వేశారు. -
35కు పెరిగిన కల్తీ మద్యం మృతులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముబారక్పూర్ పరిసర ప్రాంతంలో నిన్న కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య ఈ రోజు ఉదయానికి 35కు చేరుకుందని ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు.అయితే కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఉన్నతాధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఆ సంఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని అఖిలేష్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే ఆ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఐదుగురిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో కల్లీ మద్యం విక్రయాలను డ్డుకునేందుకు ఎక్సైజ్ అధికారులు తరచుగా దాడులు నిర్వహించాలని,కల్తీ మద్యం తయారీదారులు,అమ్మకం దారులను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ముబారక్పూర్ పరిసర ప్రాంతాల్లో శనివారం కల్తీ మద్యం సేవించి 22మంది మృతి చెందారు.మరో కొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.అయితే వారిలో కొందరు ఈ రోజు ఉదయం మరణించారు. ముబారక్పూర్ ఘటన యూపీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.