ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముబారక్పూర్ పరిసర ప్రాంతంలో నిన్న కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య ఈ రోజు ఉదయానికి 35కు చేరుకుందని ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు.అయితే కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఉన్నతాధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఆ సంఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని అఖిలేష్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
అలాగే ఆ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఐదుగురిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో కల్లీ మద్యం విక్రయాలను డ్డుకునేందుకు ఎక్సైజ్ అధికారులు తరచుగా దాడులు నిర్వహించాలని,కల్తీ మద్యం తయారీదారులు,అమ్మకం దారులను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని ముబారక్పూర్ పరిసర ప్రాంతాల్లో శనివారం కల్తీ మద్యం సేవించి 22మంది మృతి చెందారు.మరో కొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.అయితే వారిలో కొందరు ఈ రోజు ఉదయం మరణించారు. ముబారక్పూర్ ఘటన యూపీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.