ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు | Mumbai Police unjust, will keep fighting against Dawood, terrorism: ChhotaRajan | Sakshi
Sakshi News home page

ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Nov 3 2015 9:14 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు

ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు

బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై పోలీసుల్లో కొంతమంది దావూద్ ఇబ్రహీం మనుషులు ఉన్నారని వెల్లడించాడు. దావూద్ తో కుమ్మక్కయి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ముంబై పోలీసులు తనకు అన్యాయం చేశారని, తప్పుడు కేసులు బనాయించారని మీడియాతో చెప్పాడు. తనను నానారకాలుగా వేధించారని వాపోయాడు.

దావూద్ ఇబ్రహీంకు తాను భయపడబోనని ప్రకటించాడు. 22 ఏళ్లుగా దావూద్ తో పోరాడుతున్నానని చెప్పాడు. దావూద్, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. భారత ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపినా వెళ్తానని అన్నాడు. కాగా, ఇండోనేసియాలోని బాలి జైలులో ఉన్న ఛోటారాజన్ ను ఈరోజు భారత్ కు తీసుకువచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement