ఆయుధపూజ చేసిన మోడీ | Narendra Modi performs Shastra Puja with police personnel | Sakshi
Sakshi News home page

ఆయుధపూజ చేసిన మోడీ

Published Sun, Oct 13 2013 2:21 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ఆయుధపూజ చేసిన మోడీ - Sakshi

ఆయుధపూజ చేసిన మోడీ

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. దసరా సందర్భంగా పోలీసులు, భద్రతా సిబ్బందితో కలిసి 'ఆయుధ పూజ' చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులూ మోడీ ఉపవాసం ఉన్నారు. అనంతరం తన ఇంట్లో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓప్రకటనలో తెలిపింది.

ఆయుధ పూజ ఫొటోలు, వీడియోలను మోడీ తన అధికారిక వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశారు. కత్తులకు స్వయంగా బొట్లు పెట్టి, తుపాకులను దుర్గాదేవి చిత్రపటం వద్ద ఉంచి, వాటికి మోడీ పూజ చేశారు. అలాగే, ట్విట్టర్లో కూడా మోడీ దసరా శుభాకాంక్షలు అందజేశారు. తమ రాష్ట్ర పోలీసులు, భద్రతా సిబ్బందితో కలిసి ఆయుధ పూజ చేశానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement