'సంజయ్ దత్‌ను క్షమించొద్దు'
పుణే: వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు క్షమాబిక్షపై రాజకీయ పార్టీలతోపాటు అనేక వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీతోపాటు బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎన్సీపీ అగ్రనాయకుడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ ‘పేలుళ్ల కేసులో సంజయ్ దోషిగా కోర్టు నిర్ధారించింది. న్యాయప్రక్రియ ముగిసిన అనంతరం జైలుశిక్ష విధించింది.
ఆయనకు విధించిన తీర్పును క్షమిస్తే అప్పుడు న్యాయప్రక్రియకు అర్ధమే లేదు. తమను కూడా క్షమించాలంటూ ఇతర దోషులు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి డిమాండ్లు మున్ముందు బాగా పెరుగుతాయి’ అని అన్నారు. ’సంజయ్‌కి శిక్ష తగ్గించాలా వద్దా అనే విషయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంజయ్‌కి కఠిన శిక్ష విధించాలని స్వయంగా హోం శాఖే డిమాండ్ చేసింది’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.