'ఇలా అవుతుందనుకోలేదు' | Neera Yadav 'in shock' after APJ Abdul Kalam death | Sakshi
Sakshi News home page

'ఇలా అవుతుందనుకోలేదు'

Published Tue, Jul 28 2015 3:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

'ఇలా అవుతుందనుకోలేదు'

'ఇలా అవుతుందనుకోలేదు'

రాంచి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం పట్ల జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి నీరా యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మరణించారన్న వార్త  తెలియగానే ఆమె షాకయ్యారు. ఆయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు.

కొద్ది రోజుల క్రితం కలాం చిత్రపటానికి నివాళి అర్పించి ఆమె వివాదంలో ఇరుక్కున్నారు. జూలై 23న హజారీబాగ్ పాఠశాలలో కలాం ఫోటోకు దండవేసి నివాళి అర్పించి, విమర్శలపాలయ్యారు. 

అయితే విద్యార్థులు అడిగితేనే కలాం ఫోటోకు దండ వేశానని ఆమె వివరణయిచ్చారు. వారం తిరక్కముందే కలాంకు ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. అబ్దుల్ కలాంపై తనకు అపారమైన గౌరవం ఉందని, తన చిత్తశుద్ధిని శంకించొద్దని నీరా యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement