నిర్భయ కేసు: ఎప్పుడేం జరిగింది? | Nirbhaya case: Timeline of incidents | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసు: ఎప్పుడేం జరిగింది?

Published Tue, Sep 10 2013 3:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Nirbhaya case: Timeline of incidents

'నిర్భయ' కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. అత్యాచారం జరిగినప్పటినుంచి సంఘటన కాలక్రమం ఇలా ఉంది..

16 డిసెంబర్, 2012: కదులుతున్న బస్సులో 23 ఏళ్ల ఫిజియోథెరపిస్టుపై ఢిల్లీలో అత్యాచారం.
17 డిసెంబర్: బస్సు డ్రైవర్ రామ్ సింగ్, మరో ఇద్దరు నిందితుల అరెస్టు
18 డిసెంబర్: సంఘటనపై వెల్లువెత్తిన నిరసనలు, సెంట్రల్ ఢిల్లీలో పోలీసులతో జనం ఘర్షణ, నాలుగో నిందితుని అరెస్టు
19 డిసెంబర్: ఢిల్లీ కోర్టులో ఇద్దరు నిందితుల హాజరు. తనను ఉరితీయాలంటూ వినయ్ అనే నిందితుని వేడుకోలు.
21 డిసెంబర్: కేసులో నిందితుడైన మైనర్ బాలుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు. బీహార్లో ఆరో నిందితుని పట్టివేత.
22 డిసెంబర్: సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు.
23 డిసెంబర్: ఫాస్ట్ ట్రాక్ కోర్టును నెలకొల్పిన ఢిల్లీ హైకోర్టు.
24 డిసెంబర్: అత్యాచార కేసుల్లో నిందితులను వేగంగా విచారించి, శిక్షను పెంచేందుకు సూచనలిచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన
27 డిసెంబర్: చికిత్స కోసం సింగపూర్కు బాధితురాలి తరలింపు
29 డిసెంబర్: తీవ్ర గాయాలతో సింగపూర్ ఆస్పత్రిలో బాధితురాలి మరణం.
30 డిసెంబర్: ఢిల్లీకి బాధితురాలి మృతదేహం తరలింపు, అంత్యక్రియలు
2013 జనవరి ౩: ఐదుగురు నిందితులపై అత్యాచారం, హత్య, కిడ్నాప్, సాక్ష్యాల విధ్వంసం, హత్యాయత్నం కేసుల నమోదు
28 జనవరి: ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనరని తేల్చిన జువెనైల్ జస్టిస్ బోర్డు
2 ఫిబ్రవరి: ఐదుగురు నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య, ఇతర నేరారోపణల కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు మార్గం సుగమం
3 ఫిబ్రవరి: క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్సు విడుదల. మార్చి 19న లోక్సభలో, 21న రాజ్యసభలో బిల్లు ఆమోదం.
5 ఫిబ్రవరి: కోర్టులో విచారణ ప్రారంభం, నిందితుల వాంగ్మూలం రికార్డు.
11 మార్చి: తీహార్ జైల్లోని తన సెల్లో ఉరికి వేలాడుతూ కనిపించిన రామ్ సింగ్
17 మార్చి: సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి, తన కుమార్తెకు న్యాయం చేయాలని వినతి.
14 జూన్: కస్టడీలో 18 ఏళ్లు నిండిన బాలనేరస్థుడు.
11 జూలై: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పు వాయిదా వేసిన జువెనైల్ జస్టిస్ బోర్డు
25 జూలై: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పును ఆగస్టు 5కు వాయిదా వేసిన జువెనైల్ జస్టిస్ బోర్డు
22 ఆగస్టు: తీర్పు వెల్లడించేందుకు జువెనైల్ బోర్డుకు సుప్రీం ఆమోదం
31 ఆగస్టు: బాల నేరస్థుడు మూడేళ్ల పాటు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆదేశించిన జువెనైల్ జస్టిస్ బోర్డు
3 సెప్టెంబర్: తీర్పు వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు
10 సెప్టెంబర్: నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ అన్ని నేరాల్లోనూ దోషులుగా నిర్ధారణ. బుధవారం తీర్పు వెల్లడించనున్న కోర్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement