
వెనక్కు తగ్గేది లేదు: మమత
పురూలియా: భూసేకరణ బిల్లు విషయంలో వెనక్కు తగ్గేది లేదని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంతకుముందు చెప్పిన దానికే కట్టుబడ్డామన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వబోమని ఆమె పునరుద్ఘాటించారు.
'భూసేకణ బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రశక్తే లేదు' అని మమత అన్నారు. ప్రధాని మోదీతో వివాదాలు తగ్గిన నేపథ్యంలో భూసేకరణ బిల్లుపై మమత మెత్తబడ్డారని ఆరోపణలు రావడంతో ఆమె వివరణయిచ్చారు.