'శర్మ మృతి వెనుక కుట్ర లేదు' | No foul play suspected in Jabalpur college dean's death, says Delhi Police | Sakshi
Sakshi News home page

'శర్మ మృతి వెనుక కుట్ర లేదు'

Published Mon, Jul 6 2015 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

అరుణ్ శర్మ(ఫైల్)

అరుణ్ శర్మ(ఫైల్)

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణంతో సంబంధమున్న జబల్ పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ మృతి వెనుక ఎటువంటి కుట్ర లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆయన మరణం వెనుక ఎటువంటి కుట్ర ఉన్నట్టు కనబడడం లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాసి తెలిపారు. క్రైమ్ విభాగం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. సఫర్దార్ జంగ్ ఆస్పత్రిలో శర్మ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారని తెలిపారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించామని చెప్పారు.

శర్మ కుటుంబ సభ్యులతోనూ టచ్ లో ఉన్నామని వెల్లడించారు.  జబల్‌పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్‌శర్మ ఆదివారం ఢిల్లీలో ఒక హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవుడై కనిపించారు. ఇప్పటికే వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి దోషులుగా, సాక్షులుగా ఉన్న వారి వరుస అసహజ మరణాల సంఖ్య అధికారికంగానే 25 దాటిపోతుండటంతో.. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement